ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి….

ప్రజలాదే తప్పు మొత్తం … సొదరా
ప్రజల చేతలని ఆసాంతం… గమనించరా

కటకట లు తప్పవు పాలన పొడవునా…
ప్రకటనలకే పడిపోతే ఆ ఎలెక్షన్ లోన,….

చదువుకున్నోడు అంతే,
చదువూరానోడు సరే-సరి,

ఎవడి స్వార్థం వాడిది,…… అయిదు ఏళ్లకు వచ్చే పండగనుకుంటాడు
లాభాల లెక్క లు కడ్తాడు, ఓట్లపండుగ తాయిలాల కోసం చూస్తాడు ……

ఒకడు ఎక్కువ రిజర్వేషన్ కి జై , మరొకడు నేతల పుత్రుల నవ- జెనరేషన్ కి సై సై
కొందరు కులమాతములంటే, ఇంకొంధరు ఉచిత పథకాలకే తమ వోటు

దేశానికి బాగౌనా అన్నది ఎక్కడ్ ,
మనం బాగుపాడతామా అన్నదే లెక్క

రేపటి గురించి ఆలోచన లేదు,
తమ అభ్యర్ధుల గతం తెలుసుకోరు,

మంచివాడు,తగినవాడు ఎవ్వడు అన్నది చూస్తే ఒట్టు,
అందరు ఒకటే నని మళ్లీ దొంగకే వేస్తారు తమ వోటు,

ఇదేమిరా అంటే , ఎవ్వడొచ్చినా ఇంతేలే అని వేదాంతం చెబుతాడు,
తనవరకి వస్తే, అందరిమీద ఏడిచేడు, న్యూస్ చ్యానెల్-లల్లో రాధ్ధాంతం చేస్తాడు,

ఒక సగటు భారతీయుడి తీరు ఇదీ మరి,
ఇంక నేతల మీద ఏడుస్తరేందుకు పడి పడి మరి,

మంచి ని మెచ్చకుండా మరి
మంచి ఆశించడము ఎంత సరి

ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి

(చాకిరేవు వారి ఒక ఆవేదన ని చదివి …..సమాధానం చెప్పాలనే కోరిక తో రాయబడినది.)

ఇది కవిత్వమ్మో-పైత్యమో మీరే తేల్చాలి….
రమాకాంతుడు……..

టాగులు: , ,

2 స్పందనలు to “ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి….”

  1. శ్రీవాసుకి అన్నారు:

    బాగుంది. నమ్మి మోసపోవడం మనకు బాగా అలవాటైన విద్య కదా. మనం మారం. వారు మారరు.

    >>ఓట్లపండుగ తాయిలాల కోసం చూస్తాడు
    నిజమే మరి పండుగే కదా.

  2. rahamthulla అన్నారు:

    మారదు మారదు మనుషులతత్వం మారదు
    మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [[మారదు]]

    సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
    మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [[మారదు]]

    పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
    పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [[మారదు]]

    కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
    కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [[మారదు]]

    ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
    బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.