చూస్తే దిమ్మ తిరిగిపోతుంది (శ్రీ కృష్ణ కమిటీ కి నేను పంపిన రిపోర్ట్)

ఏప్రిల్ 10, 2010

నేను పంపిన రిపోర్ట్ ఎంతో సమయం వెచ్చించి తయారు చేసింది.
మీరు కూడా చూస్తారని ఇక్కడ పెదుథున్నాను.
ఇక్కడ ఆర్టికల్స్ కూడా ఇచ్చాను , వీలుంటే మీరూ చదవండి.

మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ తెలుస్తాయి.

REPORT TO SRIKRISHNA COMMITEE

రమాకాంతుడు

ప్రకటనలు

కృష్ణా జలాల చోరీ ! నింద నా నిజమా ? నేటి ఇంజినీయర్లు, మీరే తేల్చాలి మరి…(నా తీర్పు)

ఏప్రిల్ 9, 2010

YSR జల యజ్ఞం, ఒక బొంగు యజ్ఞం
KCR వాదన, ఒక గాడిద రోదన
BABU బాబు హామీ, ఒక బూటకపు కహాని

చాలా ఇంకా కావాలా

( ఈ post nu ఈ మధ్యనే వచ్చిన oka post సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ! కు జవాబు గా వ్రాయబడినది …………….)

నీటి మీద అన్యాయం జరిగింది, కాదనను .
నీరు అందరు సమ పాలు గా పంచుకుని వాడుకోవాలి…

as far as i know , తప్పు అంత ఇంజినియరింగ్ డిసైన్ లో నే ఉంది …
నాగార్జున సాగర్ డామ్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి చందంగా ఉన్నది…

ITS A FAILURE DESIGN…. ఎందుకంటే …

actually విశాలాంధ్రా ముందు హైదేరాబద్ స్టేట్ లో నే ఉన్నప్పుడు ,ప్లాన్ వేశారు , ఏమని…. నందికొండ ప్లేస్ లో డామ్ కట్టి నల్లగొండ ఖమ్మం లో ని ఎరీయాస్ లో ఇరిగేషన్ కోసమని ( అంటే ప్రస్తుత ఎడమకెనాల్ అని) లోవర్ కోర్స్ గురించి ఆలోచించ లేదు అప్పుడు. అయితే ఇంతలో ఏమైనదంటే , మన అర్స్ట్‌వైల్ మద్రాస్ స్టేట్ అప్ప్పుడు , తాము సహకరించము అని అన్నారు , ఎందుకంటే they had their own plans to harness the waters .

సరే ఆ ప్లాన్ వర్క్ ఔట్ కాలేదు .
ఇంతలో మన విశాలాంధ్ర అయ్యింది. సరే ఇప్పుడు ఏమనుకున్నారు ,,,, అదే నందికొండ దగ్గర ప్రాజెక్ట్ కడతాము , కాకపోతే రెండు రీజన్స్ కి వక్చే లాగా కడదాము అని అన్నారు.
సరే డిసైన్ తయారు అయినది , అయితే ఇక్కడ ఒకటి తెలంగాణా వాదులు తీసుకొస్తారు , ఆది ఏమిటంటే అసలు డిసైన్ చేసిన place కంటె ఒక 19 km డౌన్ స్ట్రీమ్ లో కట్టారు అని.
రీసన్ ఏమని ఆంటెయ్ ఒకరు ఆంధ్ర వాళ్ళు వక్చి లాబీ చేసి డబ్బు ముట్ట జెప్పి అక్రమంగా చేయించుకున్నారంటారు, ఇంకొకటి ఏంటంటే ఆ ప్రపోసల్ ని సెంట్రల్ గూవ్ట్. డెప్ట్ ఏదో లేక పోతే సుప్రీమ్ కోర్ట్ వొద్దని చెప్పినది అని అంటారు. ఎందుకంటే పర్యావరణo నాశనం కాకూడదని అంటారు……..ఏది నిజమో తెలువదు.
అసలు ఈ పాయంట్ నిజమో కాదో తెలువదు.

తరువాత ఏంటంటే ఇక్కడ డామ్ అయిపోయింది కనాల్స్ construct అయినవి ,ఇప్పుడు గొడవ ఏంటంటే , లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు ఉన్నాయి.లెఫ్ట్ for నల్గొండ ఖమ్మం కృష్ణ and some parts of గోదావరి అని డిసైన్ సెసారు.. రైట్ for గుంటూర్ కృష్ణ అండ్ ప్రకాశం అని అన్నారు. లెఫ్ట్ కెనాల్ స్ల్యూస్ కెనాల్ ఎక్కడో upstream లో construct చేశారంటారు. దాని వల్ల నీళ్ళు లెఫ్ట్ కెనాల్ సైడ్ రావడం లేదు అంటారు. రైట్ కెనాల్ ఏమో డామ్ కి డాగార ఉందంటారు.
అయితే అసలు ప్రాబ్లమ్ ఇక్కడ వక్చింది , లెఫ్ట్ కెనాల్ లోకి నీళ్ళు రావటం లేదని…..
ఇక్కడెయ్ అసలు ఇంజినియరింగ్ బ్లండర్ ఉంది…..plan is a failure as a result there is no sufficient waters to left canal, ki height lo undi , ఎందుకాంటెయ్ లెఫ్ట్ కెనాల్ కొద్దిగా sealevel కి హైట్ లో ఉంది when compared to right canal .
తరువాత వచ్చిన చచ్చు-పుచ్చు govt. lu. మేము అక్కడ లెఫ్ట్ కెనాల్ సైడ్ lift irrigaation చేసి ఇస్తాము అని కహాని ల హామీ లు పీకారు. దీనిని మన ఎడ్ది ప్రజలు నమ్మరు ( ఇప్పుడు జల యజ్ఞం బొంగు యజ్ఞం , తెలంగాణా ఇస్తావ-చస్తావా, నగదు పంపిణీ పథకాల లాగా అన్నమాట) వెర్రి ప్రజలు గొర్రె ల లాగా నమ్మి వోట్ లు గుద్దారు.

అసలు lift irrigaation ఆంటె ఎంటూకూడా తెలియకుండా govt. లు చెప్పాయి. lift irrigaation కి సమ్ మెగా వోల్ట్స్ ఒఫ్ ఎలెక్ట్రిసిటీ కావాలి , ఎక్కడి నుంచి తెస్దామనుకున్నరూ మరి… మామ్మూలుగా మనకు సిటీ ల లో నే ఈ మధ్య కరెంట్ తీసి వేస్తున్నాడు, ఇంకా lift irrigaation ఒకటి మెడకు డోలు లాగా. సరే అదన్న అయిందా ఆంటెయ్ , మధ్యలో ఏమన్నారంటే , lift irrigaation ఖర్చులు govt. భరించలేదు , వాడుకునే ప్రజలే కట్టు కోవాలని అన్నారు, మరి ఆది కాలేదు. ఎందుకంటే ఆది కానీ పని కనుక,,……. lift irrigaation కావాలంటే మనకు న్యూక్లియర్ పవర్ ప్ల్యాంట్స్ కావాలి ……ITS A HIGHLY IMPOSSIBLE TASK FOR INDIAN GOVT.

సరేయ్ మరి ఇటు లెఫ్ట్ కెనాల్ కి సరిగ్గా నీళ్ళు రావట్లేదు , మరి రైట్ కెనాల్ సంగతి , రైట్ కెనాల్ అదృష్టంగా కొద్దిగా downward level లో పడింది , డాఅనితో sluice canal height లెఫ్ట్ కెనాల్ దానికంటెయ్ తక్కువలో మనకు తెళువడు.

ఇక్కడ ఇంకొకటి , మొన్న ఇంత గొడవ జరిగినది కదా తెలంగాణా అని ఆంధ్ర అని.
అప్పుడు కూడా ఈ విషయం మళ్లీ వచ్చింది . అప్పుడు ప్రభుత్వం దీని మీద నిజం నిరూపించుకుంటే ( . ఈ . మీద కమీటీ కానీ వేసి దీని విషయాలు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉందా లేదా.), ఇంత గొడవ ఇన్ని మనశ్పర్థలు వచ్చేవి కాదు కద. తెలంగాణా పేరు తో చెప్పే బండ ఆబధ్ధాలు అని తెలిసేది కదా. అప్పుడు తెరా స వాళ్ళును కూడా ఇబ్బంది పెట్టేవాల్లవుతారు కదా. ప్రజలకు కూడా ప్రభుత్వం పై నమ్మకం పెరుగుతుంది కదా.

ఇది చేయకుండా ఏదో చేసి , స్టూడెంట్స్ మీద లాటి చార్జీ చేయించి , మాల్ళ్లి క్షమాపణలు అడిగి , మాటిమాటికీ కి వెళ్ళి సోనియమ్మ కాళ్ళు పట్టుకునే వీలు తప్పుతుంది కదా.
ఇంత మెదడు కూడా లేని వారు వీళ్ళు . వీళ్ళు మెదడు పనిచేస్తేనే కదా. వీళ్ళు మనందరి సమస్యలను తిరుస్తారట .
అలాంటి వాళ్ళను ఎన్నుకున్న మన అందరి తెలివి గురించి బయటి వాల్ల్‌కి తెలిస్తే వీళ్ళు మనషులా గాడిదలా అని నవ్వుకుంటారు, అంత బుర్ర కూడా లేని వారిని మన గొఱ్ఱె జనాలు సంకలు గుద్దుకుంటూ వెళ్ళి గెలిపిస్తారు .

కిమ్ కర్తవ్యం ఏమన గా

ఇప్పుడయినా ప్రభుత్వపు ముది నాయకులంతా , ఇట్లా ఒక పార్టీ వారు ఒక నిందారోపణ చేశారు కనుక ,మరియు ఇప్పటి వరకు ప్రజలలో కూడా వేరు వేరు అభిప్రాయాలుండుట చేత దీని ని తేట తెల్లగా చేయుట కొరకు ఒక మంచి reputation గల ఇంగినీర్స్ కమిటీ వేసి ( if not , take the help of european engineers) , దాన్ని మామూలు ప్రజల చేత కూడా question cheyinchi , transparent గా ఉంచి , మొత్తం కూడా గా ఉంచి దీనిని పరిష్కరించాల్‌ల్సింది గా కోరుతున్నాను . only then will there be a good opinion on the govt. and next time such dirty politicians wouldnt dare to raise any faulty and wrong issues .

ఇక్కడ మన జానా లు అందరు గొర్రె లా కాకుండా నరు ని వలె నే ఆలోచించి , ఏమయినా సందేహాలుంటే వాటిని అడిగి తీర్చుకోగలరని ఒక మానవుడి గా చిరుకోరిక నాది.
అంతే కానీ ఆలోచన లేకుండా ఎవడు ఏది చెబితే ఆది నమ్మి bus లు తగల పెట్టి పెట్రోల్ పోసుకుని అంటించుకుని నేను చస్తా ….ఆంధ్రా బాగో తెలంగాణా ఉస్కో ..గొర్రె ల లాగా సావాలి….. పని పాట లు లేని ప్రజా గాయకులు ఆంట ( ఒక్క అందెశ్రీ తప్ప) , సావు డప్పు ల దరువు ,ఏడుపుగొట్టు పాటలు ( మళ్లీ అవి తెలంగాణ పాటాలని పిచ్చి కూతలు కుస్తారు) పాడితే ఇవి వింటే మన పని అంతే సంగతులు.

దేనికయినా బుర్ర ఉపయోగిస్తే పనులు జరుగుతాయి , చక్కబడతాయి.

few links please visit them ……..

nagarjunasagar telangana dispute

Committees and Commissions in India, 1947-73: 1971-73By Virendra Kumar

Mismatch between Supplies and Demands of Canal Water in a Major Distributary Command Area of the Nagarjunasagar Left Canal

GOVERNMENT OF INDIA KRISHNA WATER DISPUTES TRIBUNAL

INDIRA SAGAR (POLAVARAM) PROJECT

see cauvery tribunal also

మీరేమంటారు?????

రమాకాంతుడు

ఈ పాట విని హాయిగా చచ్చిపోవచ్చు

ఏప్రిల్ 4, 2010

ఈ పాట విని చచ్చిపోవచ్చు హాయిగా. అంత ఫీలింగ్ ఉంటుంది ఈ పాట లో.అంత భక్తి పూర్వకంగా ఉంటుంది ఈ కీర్తన.

అందుకే మీతో పంచుకొవలనుకుంటున్నాను.

ఈ పాట ని A R RAHMAN కంపోజ్ చెయలేదు. సంస్కృతం మరియు తెలుగు ల లో ఉన్న ఈ కీర్తన అన్నమయ్య తనే వ్రాశి సంగీతం కూర్చాడు. సుబ్బలక్ష్మి పాడింది .

అబ్బబ్బా …

ఎమి తీయ్యగా ఉంది ఈ పాట . మనసు కి విందు గా ఉంది. స్వర్గాన్ని బతికిఉన్నప్పుడే చూశి రావచ్చు . భక్తి లేని వారికి కూడా భక్తి పుట్టుకొచ్చెటట్టు ఉంది ఈ పాట వింటే . ఎదో మంచి అనుభూతి అనిపిస్తుంది .

ఈ పాట/కీర్తన నాకు ఆ మధ్య ప్రొద్దున్నే 6 ఇంటికి DD తెలుగు ని చూస్తుంటే ఈ పాట వచ్చింది . మొదటిసారే బాగా అనిపించింది.
INTERNET లో వెదకగా ఈ VIDEO దొరికింది.అయితే ఈ VIDEO లొ పాట అట్లాగే ఉంచారు , కొద్దిగా మ్రుదంగం MUSIC ని మాత్రం EDIT చేశి SOUND ని తగ్గించారు . VISUALS మటుకు మార్చేశారు .LYRIC ని VIDEO లో ఎక్కించారు.
UNEDITED పాట ని వినాలంటెయ్ DD TELUGU లొ ఉదయం ఆరు నుంది ఆరున్నర మధ్యలొ వస్తుంది ( రొజువారి గా కొన్ని కొన్ని పాటల్ REPEAT అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కచ్చితంగా అనేది చెప్పలెము.) వారం లొ ఒకటి రెండు సార్లు వస్తుంది.
మీరు అటువంటి అనుభుతి నే పొందుతారనుకుంటున్నాను .

నచ్చితే ఎవరైనా ఈ DD TELUGU లో వచ్చే ORIGINAL VIDEO ని YOUTUBE లో కి ఎక్కించగలరు.

రమాకాంతుడు

ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి….

మార్చి 21, 2010

ప్రజలాదే తప్పు మొత్తం … సొదరా
ప్రజల చేతలని ఆసాంతం… గమనించరా

కటకట లు తప్పవు పాలన పొడవునా…
ప్రకటనలకే పడిపోతే ఆ ఎలెక్షన్ లోన,….

చదువుకున్నోడు అంతే,
చదువూరానోడు సరే-సరి,

ఎవడి స్వార్థం వాడిది,…… అయిదు ఏళ్లకు వచ్చే పండగనుకుంటాడు
లాభాల లెక్క లు కడ్తాడు, ఓట్లపండుగ తాయిలాల కోసం చూస్తాడు ……

ఒకడు ఎక్కువ రిజర్వేషన్ కి జై , మరొకడు నేతల పుత్రుల నవ- జెనరేషన్ కి సై సై
కొందరు కులమాతములంటే, ఇంకొంధరు ఉచిత పథకాలకే తమ వోటు

దేశానికి బాగౌనా అన్నది ఎక్కడ్ ,
మనం బాగుపాడతామా అన్నదే లెక్క

రేపటి గురించి ఆలోచన లేదు,
తమ అభ్యర్ధుల గతం తెలుసుకోరు,

మంచివాడు,తగినవాడు ఎవ్వడు అన్నది చూస్తే ఒట్టు,
అందరు ఒకటే నని మళ్లీ దొంగకే వేస్తారు తమ వోటు,

ఇదేమిరా అంటే , ఎవ్వడొచ్చినా ఇంతేలే అని వేదాంతం చెబుతాడు,
తనవరకి వస్తే, అందరిమీద ఏడిచేడు, న్యూస్ చ్యానెల్-లల్లో రాధ్ధాంతం చేస్తాడు,

ఒక సగటు భారతీయుడి తీరు ఇదీ మరి,
ఇంక నేతల మీద ఏడుస్తరేందుకు పడి పడి మరి,

మంచి ని మెచ్చకుండా మరి
మంచి ఆశించడము ఎంత సరి

ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి

(చాకిరేవు వారి ఒక ఆవేదన ని చదివి …..సమాధానం చెప్పాలనే కోరిక తో రాయబడినది.)

ఇది కవిత్వమ్మో-పైత్యమో మీరే తేల్చాలి….
రమాకాంతుడు……..

కొమరం పులి సినిమా లో ‘కొమరం’ అను పదానికి అర్థం తెలుసా?????

మార్చి 19, 2010

ముందుగా పవన్ కళ్యాన్ కు మరియు S J SURYA కు క్రుతఙ్యతలు , అచ్చమైన తేట తెలుగు సినిమా TITLE పెట్టినందుకు.

మన TITLE సంగతి లోకి వెళితే ——–

”మీకు తెలువదని నాకు ముందే తెలుసు”. ఎందుకంటే మొన్నటివరకు నాకు కుడా తెలువదు.
నేనూ అందరి లాగానే కొమరం అంటే నిజాం కు వ్యతిరేకంగా పొరాడి ప్రాణాలను బలిచ్చిన వీరుని ఇంటి పేరు అనుకున్నా . కానీ ఇది కాదు అర్థం

కొమరానికి అర్థం కుమారం అని,యవ్వనమని కొమరుడు అంటే యువకుడు అని అర్థం. ( ఒక website లో కుడా ఇట్లానే ఇచ్చాడు)కొమరయ్యా అంటే కుమారుడు అని ఇంకా చెప్పాలంటే కుమార స్వామి అని అర్థం.

ఇక్కడ కొమరం పులి అంటే యువ-పులి అని అర్థం

@#$%** కావలంటే మీరే C.P.Brown Telugu English Online Dictionary లో చూడండి…

అయితే కొమరం పులి పాటలు విడుదల కోసం చాలా WAITING…..
ఎప్పుడూ ఎప్పుడు అని చూస్తున్నా…….
ఒక తెలుగు సినిమా లో చాలా సంవత్సరాలకి A R RAHMAN direct గా Music ని ఇస్తున్నాడు కదా.

ఎంతైనా A R RAHMAN FANS కదా …..

రమాకాంతుడు

గంజాయి వనం లో తులసి మొక్క : లీడర్

మార్చి 17, 2010

లీడర్ సినిమా ఇప్పుడే నేను లీడర్ సినిమా ని చూసి వస్తున్నా , 17-3-10 first show కి వెల్లను. వెళ్ళడం 15 మిన్స్ ఆలస్యం .  అయిపోయాక  ఈ సినిమా కి రివ్యూ రాద్డామని అనుకున్నాను.

ఈ సినిమా లో ఏమీ బాగా లేవు , సినిమాటోగ్రఫీ కానీ పెద్ద గా మ్యూసిక్ కానీ డైరెక్షన్ విలువలు కానీ హీరొ హేరొఇన్ ల నటన కానీ అక్కడక్కడ స్క్రీన్‌ప్లే కానీ ఒక్కటి తప్ప అదే కథ మరియు ఈ కథ ఒక్క ఉద్దేశ్యం .

ఎందుకు అంటున్నానంటే ప్రస్తుత తెలుగు సినెమా పరిశ్రమ లో వచ్చే సినిమాలకు విరుద్ధంగా ఒక ప్రయోజకరమైన కథ తో మంచి ని మరియు విలువలను ఆది సమకాలీన రాజకీయాలను చూపెట్టింది . ఆది నచ్చింది . సినిమా లో నేటి రాజకీయాలను చూపిన తీరు మెచ్చుకోదగినది.

మన మిగతా తెలుగు సినామా లో లాగా హీరొ హేరొఇన్ లు ప్రేమ దోమ , LIP KISSలు , వేడి వేడి దృశ్యాలు లేచిపోవడాలు , హీరొ హేరొఇన్ తండ్రి ని కూడా ఎదిరిస్తననడం పిచ్చి DIALOGUES  సొల్లు FIGHTING S లేకుండా కూడా ఈ సినిమా ను చూపించాడు.

దర్శకత్వం ఇంకా పరిపక్వత లేక పోయినా కామేరా బాగా లేకున్నా ఆయన ఉద్దేశ్యానికి మంచి మార్కులు పడ్డాయి.

దర్శకుడి ప్రయత్నం గొప్పది . మూస గా కాకుండా మంచి విలువలతో చూపించాడు.

కాకపోతే తమిళం సినీ దర్శకుడు శంకర్ గాని మణిరత్నం లాగా దర్శకత్వ విలువలు సాంకేతిక నిపునత కానీ బాక్గ్రౌండ్ మ్యూసిక్ కానీ సరిగ్గా కుదరలేదు. మిక్కి జె మేయర్ కూడా ఈ విభాగం లో పైకి రావాలి . ముఖ్యంగా కర్నాటక సంగీతం కూడా వినీయ్‌గించుకోవాలి .
ఆయన ఇప్పుడు కేవలం పాశ్చాత్య సంగీతాన్నే మొత్తం పెడుతున్నారు . రహ్మాన్ లాగా YUVAN శంకర్ రాజా లాగా ఇళయరాజా లాగా మన సంగీతాన్ని కూడా కలిపి బాక్గ్రౌండ్ మ్యూసిక్ ని పెట్టాలి.  ఇంకోటి మిక్కి ఎక్కువగా GHAZALS లాగా పాటలను స్వరపరుస్తూ ఉన్నారు . అదే రెండు రెండు పదాల పల్లవి లను. హాప్పి డేస్ లోను కొత్తబంగారులోకం లోను ఇంకా గణేశ్ సినిమా లోను కొన్ని పాటలు ఇదే విధంగా ఉన్నాయి.
ఈ పధ్ధతి కాకుండా FUSION మ్యూసిక్ ని కూడా వినియోగించుకోవాలి . పాటలను CLASSIC INDIAN రాగాలకు అనుగుణం గా స్వరపరచాలి( అదే ఎప్పుడు పాశ్చాత్య స్వరాలను మాత్రమే కాకుండా , ఘజల్స్ గానే కాకుండా ఈ విధంగా అన్నమాట.)

కథ అక్కడక్కడ మనకు బోర్ కొట్టిస్తుంది . కథనం లో కూడా కొన్ని చోట్ల స్పష్టత లేదు. కథానాయకుల నటన అంతగా ఆకట్టు కునేవిధం గాలేదు.
హేరొఇన్ పాత్ర గురించి అంత గా  లేకున్నా సరిపోయింది .

ఆ మధ్య ప్రకాష్ రాజ్ ఏమన్నాడు అంటే ” తెలుగు సినిమా లో ఇంత మంచి విలువలతో మంచి కథతో వచ్చినందుకు గర్వపడుతూ ఉన్నాడట.”
ఎందుకు గంజయి వనం లో తులసి మొక్క అన్నానంటే , ప్రస్తుత పాడుపాడ్డ సినిమా లకు విరుద్ధంగా తీసినా ప్రస్తుత సమాజానికి చూడవలసిన సినిమా చూపించే ప్రయత్నం చేసినందుకు .

మరిచే పోయాను …….ఆది సినిమా అయిపోయే ముందు ” మా తెలుగు తల్లి కి మల్లె పూదండ……” పాట కి నాకు ఎందుకో గర్వంగా అనిపించింది . ఏదో గొప్ప అనుభూతి లా ఫీల్ అయ్యాను . నాకు ఈల వెయ్యాలానిపించింది. కానీ నాకు వెయ్యారాదు …….సినిమా మొత్తం లో కెల్లా ఇక్కడ అనుభూతి గొప్ప . బహుశా ఈ పాట వల్ల నేమో .  ఆంధ్రా తెలంగాణ రాయలసీమ గా కాకుండా తెలుగు వాడిననే ఫీలింగ్ కాకుండా తెలుగు వాడిననీ పౌరుషం వచ్చింది.

మిక్కి ఇక్కడ నీ సంగీతం సూపర్…………..

రమాకాంత్

ఇది మొత్తం రహమాన్ మాయే ……

ఫిబ్రవరి 17, 2010
ye maaya chesaave  పాటలు అదుర్స్ .
ఇది మొత్తం రహమాన్ మాయే ……
తెలుగు లో రహమాన్ చేత పాటలు పెట్టించాలి .  మన నిర్మాతలు పనికి రాని వాళ్ళతోటి మ్యూజిక్ పెట్టించకూడదు.
మన వాళ్ళు చాలా మంది సంగీతాన్ని చెడకొడుతున్నారు .
రమాకాంత్

చెప్పేదేముంది, అంతా పేరు లోనే ఉంది!!!!!

డిసెంబర్ 6, 2007

ITS ALL IN HIS NAME!!!!!!!!!!|><|||||!!~~~~

త్వరలో మీ ముందుంటుంకది పాటలతో కేవలం రహమాన్ వే సుమా!!!!!!!!!!!

హలో ప్రపంచమా!

డిసెంబర్ 6, 2007

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!